హైదరాబాద్ లో దారుణం.. అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పై నరికేశారు ( లైవ్ వీడియో)

హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే  ఓ యువకుడిని రౌడీ గ్యాంగ్ రోడ్డు మీదే నరికి చంపారు. షాను అనే రౌడీ గ్యాంగ్ అందరి దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే వారిని తిడుతూ ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ముస్తాక్ అనే యువకుడు దీనిని చూసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

అంతే కత్తితో వారు ముస్తాక్ గుండెల పై పొడిచారు. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు షానూర్ పరారీలో ఉన్నాడు. వీడియో కింద ఉంది చూడండి.  

 

https://www.youtube.com/watch?v=YJvMEWVL_Lg