ఆస్తి కోసం కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. !

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం ఎటువంటి దారుణాలకైనా పాల్పడటానికి వెనుకాడటం లేదు. ఇటీవల ఒక దుర్మార్గుడు డబ్బు కోసం కన్నతండ్రిని నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే…బేగంపేట విమాన్‌నగర్‌కు చెందిన అబ్రహం లింకన్‌ (84) ఆర్మీలో రిటైర్డ్ అయ్యి అనంతరం బీహెచ్‌ఈఎల్‌ పని చేసి అక్కడ కూడ రిటైర్డ్‌ అయ్యారు. అబ్రహం లింకన్ కి ఇద్దరు భార్యలు. అబ్రహం లింకన్ రెండో భార్య శేర్లింగంపల్లిలో నివాసం ఉంటుంది ఆమెకి ఒక కుమారుడు కిరణ్ (30), కుమార్తె ఉన్నారు. ఆయన మొదటి భార్య మహబూబ్‌నగర్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఇద్దరు భార్యలు, పిల్లలు అబ్రహం లింకన్‌ను పట్టించుకోకపోవడంతో అతను విమాన్‌నగర్‌లోని రాహుల్‌ రెస్టారెంట్‌లో వంట మనిషిగా పని చేస్తూ జీవిస్తున్నాడు.

అబ్రహం లింకన్‌ ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన సమయంలో షాద్‌నగర్‌లో ప్రభుత్వం నాలుగన్నర ఎకరాల భూమి కేటాయించింది. అంతేకాకుండా అబ్రహం లింకన్ కి శేరిలింగంపల్లిలో 200 గజాలవి 2ఖాళీ ప్లాట్లున్నాయి. అబ్రహం లింకన్ రెండో భార్య కుమారుడు కిరణ్ అతని తండ్రికి తెలియకుండా ఈ స్థలాలను 75 లక్షలకు విక్రయించాడు. కొంతకాలం క్రితం అబ్రహం లింకన్ కి డబ్బు అవసరం ఉండటంతో ఈ ప్లాట్లను విక్రయించాలని చూడగా అవి అప్పటికే ఇతరులు విక్రయించినట్లు తెలిసింది. దీంతో తండ్రీ కొడుకుల మధ్య ఫ్లాట్లో విషయంలో గొడవ మొదలైంది. అయితే తన అనుమతి లేకుండా ఇలా ఫ్లాట్లు విక్రయించడంతో అబ్రహం లింకన్ అడ్డుపడగా ఆ ఫ్లాట్లు కొన్నవారు అదనంగా మరో 25 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు.

ఇలా తనకు తెలియకుండా తన కొడుకు ఫ్లాట్ అమ్మటంతో అబ్రహం లింకన్ తన కుమారుడితో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఆ సమయంలో అబ్రహం లింకన్ రెండో భార్య కుమారుడు కిరణ్ ప్రభుత్వం తన తండ్రికి కేటాయించిన షాద్‌నగర్‌లో ఉండే నాలుగున్నర ఎకరాల భూమి కూడా తన పేరుపై రాయాలని, అంతేకాకుండా ఇదివరకు అమ్మిన ఫ్లాట్లపై అదనంగా వచ్చే రూ.25 లక్షలు కూడా తనకే ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి చేస్తూ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన తండ్రి వద్దకు వచ్చిన కిరణ్‌ తనతో పాటు కొడవలిని తీసుకుని వచ్చాడు. డబ్బు విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో కిరణ్ తనతో తెచ్చుకున్న గొడవలతో తన తల్లి మెడ మీద నరికాడు . దీంతో అబ్రహం లింకన్ తీవ్ర గాయాలు పాలవటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికీ అతని మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.