యూట్యూబర్ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ఈమధ్య సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికగా పలు ఖాతాలు క్రియేట్ చేసుకొని సెలబ్రెటీలుగా మారుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో వ్యూస్ కోసం లైకుల కోసం తెగ వీడియోలు చేస్తూ పంచుకుంటున్నారు. కొందరు ఎన్ని వీడియోలు చూస్తున్న వ్యూస్ రాకపోవటంతో మనస్థాపానికి గురవుతున్నారు.

అలా తాజాగా ఓ యూట్యూబర్ తన యూట్యూబ్ లో వ్యూస్ పెరగట్లేదు అని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదు సైదాబాద్ కు చెందిన దీనా అనే ఐఐటి విద్యార్థి గ్వాలియర్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక ఇతడు యూట్యూబ్లో ఒక గేమ్ ఛానల్ నిర్వహించాడు. దీంతో అతడికి వ్యూయర్స్ పెరగట్లేదు అని తన బాధను సబ్స్క్రైబర్లతో పంచుకున్నాడు. అయినా కూడా అతడు అందులో నుంచి బయటకు రాకపోగా తన సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్ అప్లోడ్ చేసి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.