వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఒక్కటి కావాలనుకున్నారు. కానీ పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇక బతకడం వృథా అని జీవచ్ఛవాలుగా మారిపోయారు.
మెదక్ రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బాలేష్ అనే యువకుడు రామాయంపేటలోని ఓ షాపులో పని చేసేవాడు. రాయాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ప్రవీణ రామాయంపేటలో టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుండగా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయం బాలేష్ ఇంట్లో తెలియడంతో వారు మందలించారు.
దీంతో తమ ప్రేమకు ఇంట్లో ఒప్పుకోరని భయపడిన వారు ఇంటి నుంచి వెళ్లిపోయి లింగాపూర్ శివారులోని గుట్ట దగ్గర ఉరేసుకున్నారు. బాలేష్ బైక్ ను గుర్తించిన స్థానికులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.