హమ్మయ్య, లోకేష్ ట్వీట్ సూపర్ హిట్

నారా లోకేష్ సౌరబ్ చౌదరిని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ని ఎవరూ విమర్శించలేదు. పైగా అందరూ ఆయన్నే అనుసరించారు. ఆసియా గేమ్స్ 2018 షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించాడు సౌరబ్ చౌదరి. ఈ నేపథ్యంలో అతని గురించి ఒక ట్వీట్ పెట్టారు లోకేష్.

ఆసియా గేమ్స్ 2018 లో బంగారు పథకాన్ని సాధించిన 16 ఏళ్ళ షూటర్ సౌరబ్ చౌదరికి నా అభినందనలు. సౌరబ్ మూడేళ్ళ నుండే షూటింగ్ శిక్షణ ప్రారంభించాడని తెలిసి సర్ప్రైజ్ గా ఉంది. నిజమైన విజేత. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. నెటిజెన్లు కంగ్రాట్స్ సౌరబ్ అంటూ రీట్వీట్స్ చేయడం ఆరంభించారు.