కడపలో 3000 ఉద్యోగాలు: లోకేష్ ట్వీట్

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగులను ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. కడప జిల్లా ప్రొద్దటూరులో 15 కంపెనీలకు పైగా రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. 10 వ తరగతి నుండి పీజీ అర్హత ఉన్నవారికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈమేరకు నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండు రోజుల రిక్రూట్ మెంట్ డ్రైవ్ నడుస్తోంది. గోఏపీస్(గోల్ ఓరియెంటెడ్ యాక్షన్ ప్లానింగ్) ఎపిఐటీ (ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ) త్వరలో ఆంధ్రాలో మొదలవనున్న పలు కంపెనీల కోసం ౩౦౦౦ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇది కేవలం ఈ సెలెక్షన్స్ ఈరోజు, రేపు మాత్రమే జరగనున్నాయి. మీ మిత్రులకి కూడా తెలపండి అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్, వెన్యూ, రిక్రూట్ మెంట్ డీటెయిల్స్ కింద ఉన్నాయి చూడండి.