రోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన స్టూడెంట్స్.. రంగంలోకి దిగిన పోలీసులు.. చివరికి?

ఈ ఆన్ లైన్ యుగంలో అనేకమంది అనేక ఛాలెంజ్ ల పేరిట ఎప్పుడు ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. ఇవి కరోనా లాక్ డౌన్ సమయంలో మరింత పెరిగాయి. వీటిలో కొన్ని మంచి పనులకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక కొత్త చాలెంజ్ తెర మీదకు వచ్చింది. ఇది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు, అదే “లిప్ లాక్ ఛాలెంజ్”.

వివరాల్లోకి వెళితే… కర్ణాటక లోని దక్షిణ ప్రాంతమైన మంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు నడిరోడ్డుపై లిప్ లాక్ ఛాలెంజ్ తో రెచ్చిపోయారు. నగరంలోని ఒక కాలనీలో వీరు లిప్ లాక్ ఛాలెంజ్ తల పెట్టగా… ఒక అమ్మాయి, అబ్బాయి నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయారు. దీనిని వారి చుట్టూ ఉన్న స్నేహితులు కమాన్ కమాన్ అంటూ రెచ్చగొట్టారు. ముద్దుల పేరిట స్టూడెంట్స్ చేసిన రచ్చకు విసిగిపోయిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ తతంగాన్ని ఒక వ్యక్తి వీడియో తీయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటక దక్షిణ ప్రాంతం అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఈ తతంగంలో ఉన్న 8 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల మీద లైంగిక దాడి చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. వారిపై సెక్షన్లు 376, 354, 354(C), 120B, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.