గిరిజన ఎమ్మెల్యే కిడారి హత్య తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉన్న ఏజన్సీ ప్రాంతంలో ఇంకా ఉద్రికత్త ఉందనే చెబుతున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు తీవ్రంగా జరుగుతూనే ఉంది. ఇలాంటపుడు విశాఖ జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కిడారి హత్యకు సెక్యూరిటీ లోపాలు కూడా కారణమనే వాదన కూడా ఉంది. ఎమ్మెల్యేని చంపడాన్ని సీరియస్ తీసుకున్న ప్రభుత్వం ఎస్ పి ని మార్చి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విఐపిల సెక్యూరిటీని పటిష్టం చేయానుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే జిల్లా ఎస్ పిని మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ హత్య అనంతరం డిఐజి శ్రీకాంత్ పనితీరుకు బాగా ప్రశంసలొచ్చాయి. రాహుల్ పేరు ఎక్కడా ప్రముఖంగా వినిపించలేదు. పోలీసులలో, ప్రజలలో ధైర్యం నింపేందుకు డిఐజి శ్రీ కాంత్ మావోయిస్టు ప్రాంతాలలో తిరగడం, ప్రజలతో, పోలీసులతో మ ాట్లాడటం, అక్కడే రాత్రి బస చేయడం జరిగేది. మొత్తం సీన్లో డిఐజీ యే కనిపించాడు తప్ప ఎస్ పి కనిపించలేదు.
ఈ రోజు జరుగనున్న పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 14-15 ఐపిఎస్ లను మార్పు చేస్తుమన్నారని తెలిసింది.