అంధ్రప్రదేశ్ లో ఐపిఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో  14 మంది ఐపిఎస్ అధికారుల బదీలీ చేశారు.రాయలసీమ జిల్లాలన్నింటికి  కొత్త ఎస్పీలను నియమించారు.  అనుకున్నట్లుగా విశాఖ రూరల్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారు. ఆయనను విశాఖ సిట్ అధిపతి చేశారు. మిగతా బదిలీలకు సంబంధించిన వివరాలు:

చిత్తూరు ఎస్పీ గా ఉన్న అట్టడా బాబుజీ ని విశాఖపట్నం రూరల్ ఎస్పీ గా బదిలీ అయ్యారు,

గుంటూరు రూరల్ ఎస్పీ గా రాజశేఖర బాబు,నెల్లూరు ఎస్పీ గా ఐశ్వర్య రాస్తోగి,చిత్తురు జిల్లా ఎస్పీ గా విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లా ఎస్పీ గా పక్కీరప్పా కాగినెల్లి నియమితులయ్యారు.  కడప జిల్లా ఎస్పీ గా అభిషేక్ మహాంతి, తిరుపతి అర్బన్ ఎస్పీ గా అన్బురాజన్, విజయవాడ లా&ఆర్డర్ 1 వెంకట అప్పలనాయుడు, ఏస్.ఐ.బి పిహెచ్ డి గా  రామకృష్ణ లను బదిలీ చేశారు. విశాఖపట్నం లా&ఆర్డర్ 2 కు నయిమ్ ఆస్మీ, టిటిడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా  గోపినాద్ జెట్టీ, నర్సాపురం ఒఎస్ డిగా ఉన్న    సిద్దార్దా కౌషల్ ను గుంతకల్లు ఏస్.ఆర్.పి కి, విశాఖపట్నం సిటి  లా&ఆర్డర్ 1 కు  రవీంద్రనాద్ బాబు ను ట్రాన్స్ ఫర్ చేశారు.