విశాఖ ఏజన్సీ ఏరియాలో ఎపుడూ జరుగుతుందో నని భయపడుతున్నారు. అందుకే ఆ ప్రాంతాల్లో ప్రముఖులు తిరగడం మీద దాదాపు నిషేధం ఉంది. వెళ్లాలంటే పోలీసులకు చెప్పి తగిన బందోబస్తు తీసుకుని వెళ్లాలి… ఇలా అనుకుంటు వుంటారు. అయితే, మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశాక అక్కడ కొంచెం భయోత్పాతం కల్గిన మాట నిజమే.
పోలీసుల దాదాపు వార్ డిక్లేర్ చేసి మావోయిస్టులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదొక వైపు జరుగుతున్నా, ఈ ప్రాంతాలు సురక్షితంగానే ఉన్నాయని, అనవసర ఆందోళన పడనవసరం లేదని , పోలీసులూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మరక్షణలో ఉంటూనే ప్రజల్లో భద్రతాభావం కల్గించేందుకు ఎలాంటి చర్యలుతీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉంది అనే విషయం మీద ఆయన మావోయి్టు ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లే సూచనలిస్తున్నారు. అయనెవరనుకుంటున్నారు. ఆయన విశాఖరేంజ్ శ్రీకాంత్.
జంట హత్యల తర్వాత మన్యం పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు, ఆప్రాంత ప్రజలలో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు ఆయన ఆ ప్రాంతంలో పర్యటనలు జరుపుతున్నారు. రాత్రిపూట అక్కడే బస చేస్తున్నారు. ఎస్పి ఆర్ డి శర్మ ను వెంటబెట్టుకుని ఆయన సోమవారం నాడు పాడేరు వెళ్లారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం రోడ్డు మార్గంలో పెద్ద వలస చేరుకున్నారు. పెద్ద వలస తెలుసు కదా, మావోయిస్టులకు కంచుకోట. ఈ ప్రాంతం లో చాలా మంది గిరిజనులను ఇన్ ఫార్మర్ పేరుతో హత్య చేశారు. అక్కడి నుంచి తూరు మామిడి అవుట్ పోస్టును సందర్శించి పరిస్థితి సమీక్షించారు. తర్వాత రంపుల ఘాట్ మీదుగా కెడిపేట కు చేరుకున్నారు. జికె వీధిమండలం లోని రంపుల-కొత్తవలస మావోయస్టుబెల్ట్,ఇక్కడికి విఐపిలను అనుమతించడం జరగదు. జంటహత్యల తర్వాత, ఈ ప్రాంతాలోకి ప్రజాప్రతినిధులను అనుమతించకుండా నిషేధించారు.
ఇక్కడ పరిస్థితి అదుపులో ఉందని చెప్పేందుకు ఇపుడు డిఐజి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. అయన పర్యటన అధికారులకు, ప్రజలకు కూడా ధైర్యమిస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, చింతపల్లి స్టేషన్ను గత ఐదు రోజులలో డిఐజి శ్రీకాంత్ సందర్శించడం రెండోసారి. మావోయిస్టుల హిట్ లిస్టులో వున్న వ్యక్తుల భద్రత గురించి ఆయన సూచలిచ్చారు. అదే విధంగా సోమవారం రాత్రి చింతపల్లి పోలీసు స్టేషన్‌లో స్థానిక పోలీసు అధికారులతో పాటు సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ అధికారులతో కూడా మాట్లాడారు.
సిహెచ్ శ్రీకాంత్ ఎక్కడ పనిచేసిన తన అనావాళ్లు వదిలే వెళ్తారు. ఆయన పనిచేసిన చోటల్లా ఆయనకు మంచి పేరుంది. పోలీసుల్లోనే కాదు, ప్రజల్లో కూడా ఆయన స్థానం పదిలపర్చుకుంటువస్తున్నారు. 2002 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీకాంత్ మొదట నర్సిపట్నం ఒఎస్డిగా పనిచేశారు. తర్వాత శ్రీకాకుళం,కర్నూల్, ప్రకాశం ఎస్ పిగా పని చేశారు. ఆపైన ఎసిబిలో జాయింట్ డైరెక్టర్ గా కొన్నాళ్లున్నారు. ఇపుడు వైజాగ్ డిఐజిగా పనిచేస్తున్నారు.