వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు, కోటంరెడ్డి ధర్నా

రాష్ట్ంలో వైసిపి పిలుపు మేరకు రేపు బంద్ జరగకుండా అడ్డుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్బంధం మొదలుపెట్టింది.నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యేలు తిరగకుండా అక్కడక్కడా అడ్డుకోవడం మొదలుపెట్టారు.

కావాలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోలీస్ లు ఈ ఉదయం నుంచి  గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఈ ఉదయం నియోజకవర్గంలోని మత్స్య కారుల గ్రామాలలో పర్యటించాల్సిఉంది. నిజానికి ఆయనను అక్కడి ప్రజలే ఆహ్వానించారు.  ఈ మేరకు ఆయన ఈ గ్రామాలకు వెళ్లాల్సి ఉండింది. అయితే, పొద్దునే పోలీసులు ఇంటికి వచ్చిన బయటకు వెళ్లడానికి వీల్లేదని, గృహనిర్బంధంలో ఉంచుతున్నామని  ప్రకటించారు.

అయితే, ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావలి వెళ్లి నిరసన ధర్నాచేపట్టారు.  ఎమ్మెల్యేని కారణం లేకుండా అరెస్డు చేయడానికి అభ్యంతరం చెప్పారు. అరెస్టు ఉత్తర్వులను చూపించాలని పోలీసులను నిలదీశారు. అయితే, కాయితం ఇంకా రాలేదని, తొందర్లో వస్తుందని చెప్పారు.

దీనితో కోటంరెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎమ్మెల్యని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.

‘కావాలి ఎమ్మెల్యే గృహ నిర్బంధం బరితెగించిన అధికారపార్టీ ఆగడాలకు పరాకాష్ట,’ అని   కోటంరెడ్డి విమర్శించారు అధికారపార్టీ బెదిరంపులకు, అక్రమ కేసులకు అదరం – బెదరమని, తమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. రేపటి బంద్ విజయవంతమవుతుందని అన్నారు.

నెల్లూరు నుంచి తెలుగు రాజ్యంతో మాట్లాడుతూ అనేక నియోజకవర్గాలలలో తెలుగుదేశం పట్టు కోల్పోతున్నందున, ఎలాంటి సమస్యలేకపోయినా పోలీసులు నిర్భంధం విధిస్తున్నారని, అప్రజాస్వామిక పాలనకు తెరలేపుతున్నారని అన్నారు.

ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటామని రేపటి హోదా బంద్ ను విజయవంతం చేస్తామని అన్నారు.