నార్కట్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరో మెడికల్ స్టూడెంట్ రమ్య గురువారం చనిపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు కామినేని కాలేజిలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ నెల 20న నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద మెడికల్ కాలేజి స్కూటిని లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో స్రవంతి అక్కడికక్కడే చనిపోగా రమ్య, నవ్య జ్యోతిలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ రమ్య గురువారం చనిపోయింది. నవ్యజ్యోతికి స్టార్ హాస్పిటల్ లో చికిత్సనందిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన రమ్య, నవ్యజ్యోతి మరియు ఆదిలాబాద్ కు చెందిన స్రవంతిలు నార్కట్ పల్లి కామినేని మెడికల్ కాలేజిలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. మరో రెండు నెలల్లో వీరి ప్రాక్టీస్ పూర్తయ్యి పట్టా అందుకునేవారు. ఆదివారం ఉదయం కాలేజి నుంచి వెళ్లి ఏపీ లింగోటం వద్ద టిఫిన్ చేశారు. తిరిగి ముగ్గురు స్కూటి పై కాలేజికి వస్తున్నారు. స్కూటీని నవ్వజ్యోతి నడుపుతుండగా మధ్యలో రమ్య, చివరన స్రవంతి కూర్చుందని స్థానికులు తెలిపారు. వీరి స్కూటిని గుర్తు తెలియని లారీ వేగంగా వచ్చి గుద్దుకుంది. దీంతో ప్రమాదంలో అక్కడికక్కడే స్రవంతి మృతి చెందగా, రమ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నవ్య జ్యోతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు సమాచారం.
దీంతో ముగ్గురి హౌస్‌సర్జన్లు కుటంబాల్లో విషాదం నిలెకొంది. రెండు నెలల్లో వైద్యులై అండగా ఉంటారనుకున్న ఇద్దరు విగతజీవులుగా మారడం, మరోకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తట్టుకోలేకపోతున్నారు. అప్పటివరకు తమ కళ్లెదుట కదలాడిన స్నేహితులు ప్రమాదం బారిన పడడంతో తోటివారు నేటికీ షాక్‌లో ఉన్నారు.
కేసు దర్యాప్తులో పోలీసుల విఫలం
ఇద్దరి మెడికోలు మృతి చెంది, మరో మెడికో పరిస్థితి విషమంగా ఉన్న ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నత్తనడకన జరుగుతోంది. పోలీసులు పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున అనుకున్నంత వేగంగా సాగడంలేదనే విమర్శ ఉంది. ఈ మెడికోలు ప్రయాణించిన స్కూటీ గడ్డం స్నేహలత పేరిట ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రర్ అయి ఉంది. ఈ వాహనం ఈ ముగ్గురిదీ కాదని కామినేనిలోనే హౌస్‌సర్జన్ చేస్తున్న ఓ స్నేహితుడిదని సమాచారం.
కామినేని ఆస్పత్రి ఎదుట సీసీ కెమారాలు ఉన్నాయి. ఈ కెమెరాలే ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ కేసుపై పోలీసులు అంతగా దృష్టి సారించనందునే ఈ మెడికోల వాహనాన్ని ఢీకొట్టిన లారీని గుర్తించడంలో జాప్యం జరగుతుందనో విమర్శలు ఉన్నాయి.
రోడ్డు ప్రమాదం వీడియో కింద ఉంది చూడండి