పూణే పోలీసుల సోదాలపై జర్నలిస్టు క్రాంతి రియాక్షన్ (వీడియో)

పూణే పోలీసులు మంగళవారం హైదరాబాద్ వచ్చి పలువురి ఇండ్లలో సోదాలు నిర్వహించారు. నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసే క్రాంతి అనే జర్నలిస్టు ఇంట్లోకి ప్రవేశించి ఇంటిని జల్లెడ పట్టారు. ప్రధాని నరేంద్ర మోడీని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని చంపినట్లు చంపేందుకు కుట్ర పన్నారన్న అభియోగం మీద జర్నలిస్టు క్రాంతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. 

పోలీసులు వచ్చీ రాగానే క్రాంతి సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఆయన ల్యాప్ టాప్ తీసుకున్నారు. ఇంట్లో ఉన్న పుస్తకాలను సీజ్ చేశారు. విప్లవ రచయితల సంఘంలో క్రాంతి పనిచేస్తున్నారు. దీంతో ఆయన ఇంట్లో ఏమేమి పుస్తకాలు ఉన్నాయిని ఇల్లంతా వెతికారు. ఇంట్లోకి చొరబడిన పోలీసుల తీరుపై క్రాంతి మీడియాతో మాట్లాడారు. ఆయనేమంటున్నారో కింద వీడియో ఉంది చూడండి.