గజ్వేల్ లో కాంగ్రెస్ కు హరీష్ రావు ఉల్టా షాక్

టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచారు హరీష్ రావు. క్రిటికల్ ఆపరేషన్స్ అన్నీ హరీష్ రావే చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో హరీష్ రావుకు టిఆర్ఎస్ లో కొంత ప్రాధాన్యత తగ్గినట్లు గుసగుసలు వినబడ్డాయి. కొద్దిరోజులపాటు నమస్తే తెలంగాణ పత్రికలో హరీష్ రావు వార్తలపై నిషేధం విధించారు. ఆయన వార్తలు జోన్ పేజీకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు తేరుకున్నట్లు కనబడుతున్నది. హరీష్ రావు వార్తలు కూడా నమస్తే తెలంగాణ పత్రికలో కనబడుతున్నాయి.

మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వరుస సభలు పెట్టి హరీష్ రావు హోరెత్తిస్తున్నారు. గజ్వేల్ లో ప్రత్యేక దృష్టి సారించారు హరీష్ రావు. తన మామ, పార్టీ అధినేత అయిన కేసిఆర్ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో పార్టీని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారాయన.  తన మేనమామ, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పోటీచేయనున్న నియోజకవర్గం గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీకి ఉల్టా షాక్ ఇచ్చారు హరీష్ రావు. ఉల్టా షాక్ ఎందుకబ్బా అనుకుంటున్నారా?  చదవండి.

సొంతగూటికి చేరిన టిఆర్ఎస్ నేతలు

నిన్న (బుధవారం) గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొందరు టిఆర్ఎస్ నేతలు గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్ వచ్చి పిసిసి చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో ఒక ఎంపిపి, పలువురు ఎంపిటిసిలు, కొందరు మాజీ సర్పంచ్ లు, కొందరు మాజీ వార్డు సభ్యులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వారిని ఉద్దేశించి ఉత్తమ్ మాట్లాడారు. గజ్వేల్ లో వాతావరణం చూస్తుంటే వంటేరు ప్రతాపరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అయినట్లే అన్నారు. 

అయితే వారు కాంగ్రెస్ లో చేరగానే హరీష్ రావు ఆపరేషన్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ లో చేరిన వారు 24 గంటలు గడవకముందే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారిని తిరిగి తీసుకురావడంలో హరీష్ సక్సెస్ అయ్యారు. హరీష్ రంగంలోకి దిగగానే కాంగ్రెస్ గూటికి చేరినోళ్లలో సగానికి పైగా తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.  వారే కాదు దుబ్బాక నియోజకవర్గ నేతలు కూడా కొందరు తిరిగి టిఆర్ఎస్ లోకి చేరారు.

కాంగ్రెస్ నుంచి తిరిగి టిఆఱ్ఎస్ లో చేరిన నేతలతో హరీష్

కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగా నే తాము కాంగ్రెస్ లో చేరామని ఆ నేతలు చెప్పారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య వారి అ‌నుచరులతో సహా తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పారు.

కాంగ్రెస్ మరో మారు తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెరాస కార్యకర్తలను, నేతలను ఒత్తిళ్లకు గురిచేసి పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస కార్యకర్తలు ఇలాంటి ప్రలోభాలకు గురయ్యే వారు కాదన్నారు. మెదక్ జిల్లాలో పది సీట్లు గెలిపించి కాంగ్రెస్ కు బుద్ది తెబుతారన్నారు.
తమకు , ప్రజలకు తెరాస తప్ప మరో పార్టీ భవిష్యత్తు ఇవ్వదని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కష్టపడతామన్నారు.

 

ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ నేతల తాలూకు న్యూస్ కింద లింక్ లో ఉంది చూడండి. 


https://bit.ly/2E4eQTF