ప్రయివేటు కాలేజీల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. స్టూడెంట్స్ ను హింసిస్తూ రోజుకో విద్యాసంస్థ వెలుగులోకి వస్తున్నది. ఇక కార్పొరేట్ కాలేజీలైతే ఏకంగా విద్యార్థులను సునాయాసంగా అంతమొందిస్తున్న దాఖలాలున్నాయి.
మార్కులే పరమావధిగా విద్యార్థులను మానసిక, శారీరకంగా హింసిస్తున్నాయి ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు. అటువంటి కోవలో నడుస్తున్న కాలేజీ ఇది. పూర్తి వివరాలు చదవండి. వీడియో కూడా చూడండి.
యాదాద్రి-భువనగిరి జిల్లా రాజధాని భువనగిరిలో ప్రతిభ జూనియర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో లో మార్కులు తక్కువగా వచ్చాయని ఇంటర్ అమ్మాయిలను కాలేజీ లెక్చరర్ చితకబాదాడు.
బెత్తం తీసుకుని అమ్మాయిల చేతులు వాసేటట్లు చితకబాదాడు ఫిజిక్స్ లెక్చరర్ మురళి. అయితే ఒకపక్క అమ్మాయిలను చితకబాదుతుంటే మరోవైపు ఆ కాలేజీ స్టూడెంట్స్ ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో స్టూడెంట్స్ వర్గాల్లో వైరల్ గా మారింది.
అసలు స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ ను శారీరకంగా దండించే చాన్సే పంతుళ్లకు లేదని మన చట్టాలు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు అదీ ఇంటర్ అమ్మాయిలను బెత్తం తీసుకుని చేతలు వాచేలా కొట్టడమేంటని స్టూడెంట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పంతుళ్లు పాఠాలు సక్కగ చెప్పకుండా పిల్లలను వేధింపులకు గురిచేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు, ఎన్నికల కమిషన్ ఏరకమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
విద్యార్థినిలను చితకబాదుతున్న వీడియో కింద ఉంది.