ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రాబోయే మూడేళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనున్నట్టు వెల్లడించింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ బదిలీల ప్రక్రియ ఇప్పటికే మొదలైందనే సంగతి తెలిసిందే. 401 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 1,13,275 విద్యార్థులుఈ మోడల్ స్కూళ్లలో చదువుతున్నారని సమాచారం.

 

దేశంలోని గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే మూడు సంవత్సరాలలో మరిన్ని ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ స్కూల్స్ కోసం ఏకంగా 15000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే వెలువడిన ఉద్యోగాల కోసం emrs.tribal.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీల నుంచి స్వీపర్ ఉద్యోగ ఖాళీల వరకు అన్ని ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

 

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో అర్హతల ఆధారంగా వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.