వొళ్లు దగ్గిర పెట్టుకోండి… హైదరాబాద్ పోలీసుల సూపర్ ట్వీట్

వర్షాకాలం రోడ్లమీద తుంటరి పనులకు పాల్పడే వారికి హైదరాబాద్ పోలీసులు ఒక హెచ్చరిక చేశారు. పోలీసుల నుంచి ఇలాంటి సందేశం రావడం ఇదే మొదలు.  ఈ హెచ్చరిక కూడాఎజుకేటివ్ గా, సున్నితంగా ఉండటం మరీ విశేషం.

వర్షాకాలం  కార్లలో, ద్విచక్రవాహానాల మీద రోడ్ల మీద దూసుకుపోయేవాళ్లలో  కొద్ది  ఒక విషయం మర్చిపోతుంటారు,కాదు వొళ్లు మర్చిపోతుంటారు. ఇక ఆర్టీసి డ్రైవర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  తామలా దూసుకుపోతున్నపుడు రోడ్డు మీద నిలిచిన బురదనీళ్లు ఫుట్ పాత్ మీద పోతున్నవారి మీద చిట్టి వారి బట్టలు పాడవడమే కాదు వాళ్లకి చాలా నష్టం కల్గిస్తూ ఉంటారు. న  డుచుకుంటూ స్కూళ్లకు పోయే పిల్లలు, ఇతర పాదచారులు  ఇలా నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వాహనాలు నడిపే వారిబారిన పడుతుంటారు. పిల్లలు స్కూళ్లకి వెళ్లలేరు. పెద్ద వాళ్లు తమ పనులమీద వేళ్లడం మానేయాలి.  ఇలా వొళ్లుమరిచిన వాళ్లలో పాదచారుల సృహ కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు చాలా హుందా అయిన క్యాంపెయిన్  మొదలుపెట్టారు. దీనిమీద అద్భతమయిన ట్వీట్ చేశారు.

కారున్నోళ్లే కాదు,టూవీలర్లున్నోళ్లు కూడా రోడ్లమీద నీరు నిలిచిన చోట్ల బాధ్యతాయుతంగా బండి నడపాలని,పాదచారుల మీద ఈమురికినీరు పడడకుండా జాగ్రత్తగా నడపాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను జత చేసి ట్విట్టర్ లో పెట్టారు.

 

ఈ ట్వీట్ కు బాగా ప్రశంసలందుతున్నాయి. ఇది చూసిన వారికి కచ్చితంగా జ్ఞానోదయం అవుతుందనిపిస్తుంది.

ఇలాంటి క్యాంపెయిన ఆర్టీసి వారు, కార్ అగ్రిగేటర్లయిన ఓలా, ఊబర్ లు కూడా చేపట్టి, వాళ్ల సిబ్బందిలో కూడా జ్ఞానోదయం కలిగించాలని కోరుకుందాం.ఎందకంటే, ఆర్టీసి వాహానాలు ఎలా దూసుకుపోతుంటాయోమనం చూసిందే…

ఈ విషయాన్ని ఈ ట్వీట్ ప్రశంసించిన వారు కూడా గుర్తు చేశారు. ఆర్టీసి డ్రయివర్ల  మీద చాలా మందికి సదబిప్రాయం లేదు. 

ఈ ట్వీట్ రూపొందించిన హైదరాబాద్  పోలీసులు కారు వోనర్ల, బైక్ యూజర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం చాలా మందికి నచ్చడం లేదు.
ట్వీట్ లో ఆర్టీసి డ్రయివర్లకు కూడా హెచ్చరిక ఉండాల్సిందన్నచాలా  మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.