టీఎస్‌ఆర్టీసీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కొరకు ఆర్టీసీ దరఖాస్తులు కోరుతుండగా అర్హత ఉన్నవాళ్లు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
డిగ్రీ పాసైన వాళ్లకు వైరల్ అవుతున్న వార్త అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లేకుండానే ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండగా ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ధ్రువ పత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు.
http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఒక్కో రీజియన్ లో కొన్ని ఉద్యోగ ఖాళీలు ఉండగా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.