ఆయన కాలేజి లెక్చరర్. వందలాది మంది విద్యార్దులకు చదువు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉన్నతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ అతని వక్రబుద్దితో తన భార్యను వేధించసాగాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
కర్ణాటకలోని నేలమంగళ టైన్ కు చెందిన వసంత్ కుమార్ ఓ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఇతను 2004లో ఎన్జీవో సంస్థలో పని చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన సంవత్సరం తర్వాత ఆమె ఉద్యోగం మానేసింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కొద్ది కాలంగా అదనపు కట్నం తేవాలని వసంత్ కుమార్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అయితే పుట్టింటి వారి ఆర్ధిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో వసంత్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆమె భరించింది.
ఇక పిల్లలు తనకు పుట్టలేదని వేధించసాగాడు. దీంతో ఆమె డిఎన్ ఏ టెస్టు చేయించాలని పట్టుబట్టింది. దీంతో చేసేదేం లేక నోర్మూసుకున్నాడు. ఆ తర్వాత భార్యకు హెచ్ ఐవి ఉందని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఓ పొట్టి డ్రెస్ వేసుకొని పోర్న్ వీడియోలో నటించాలని కోరాడు. ఆ వీడియోను అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను చంపుతానని బెదిరించాడు. బాత్రూంలోకి వెళ్లి డ్రెస్ వేసుకొని వస్తానని చెప్పిన ఆమె అతనిని ఇంట్లో బంధించి తలుపు పెట్టి బయటికి వచ్చింది. భర్త చేసిన ఆకృత్యాల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సదరు లెక్చరర్ ను అరెస్టు చేశారు.