భర్త ఎఫైర్ తెలిసి భార్య ఆత్మహత్య

వారు పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎంతో అన్యోన్యంగా జీవించారు. వారు కాపురానికి గుర్తుగా ఒక పండంటి కొడుకు  పుట్టాడు. భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య తానిక బతకలేనంటూ తనును చాలించింది. ఇంతకీ ఈ స్టోరీ వివరాలేంటంటే… 

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కాళిశెట్టి శివకుమార్, అనంతలక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరు 2015 ఏప్రిల్ 22న ద్వారక తిరుమలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినా కూడా వీరు ఇంట్లో ఎదురించి పెళ్లి చేసుకున్నారు. శివకుమార్ స్థానిక ఎస్ బీఐ బ్యాంకులో పని చేస్తున్నారు. అనంత లక్ష్మీ స్వస్థలం ఆచంట మండలం కొడమంచిలి. అనంతలక్ష్మీతో వివాహానికి ముందే శివకుమార్ కు రాజమండ్రికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీనిని దాచి అనంతలక్ష్మీతో ప్రేమాయాణం సాగించి శివకుమార్ పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లైన సంవత్సరం వరకు బాగున్న శివకుమార్  ఆ తర్వాత అతనిలో మార్పు  వచ్చిందని అనంత లక్ష్మీ బాధపడేదని పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అసలు విషయం తెలియడంతో భార్య భర్తల మధ్య వివాదాలు చెలరేగాయి. వీరికి సంవత్సరంన్నర ఉన్న కొడుకు ఉన్నాడు. నాలుగు రోజుల కింద శివకుమార్ తిరుపతి వెళుతున్నానని చెప్పి ప్రియురాలితో కలిసి తిరుపతికి వెళ్లాడని తెలుసుకొని అనంతలక్ష్మీ అతనితో ఫోన్ లో ఘర్షణ పడింది. మనస్తాపం చెందిన అనంతలక్ష్మీ అతని కుమారుడిని తన అమ్మ గారింటి దగ్గర దింపి తాను పనిమీద బయటికి పోతున్నానని చెప్పి రూముకు వెళ్లింది.

సాయంత్రం అయినా తిరిగిరాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశారు. స్పందన రాకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంది. దీంతో షాక్ కు గురైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు మృతికి అల్లుడు, ఆమె ప్రియురాలే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతలక్ష్మీ తన సూసైడ్ నోట్ లో ఇలా రాసింది.

‘‘నా భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితాన్ని వీళ్లంతా సర్వనాశనం చేశారు. నాకు వేరే దిక్కు లేదు. మూడేళ్ల వయసున్న నా కొడుకును ఒంటరిగా వదిలి చనిపోతున్నాను. నా భర్తకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి ఇకపై ఎవరి కాపురాల్ని కూల్చకుండా ఉంటుంది. రెండేళ్లలో ఆమె పరిస్థితి కూడా నాలాగే తయారవుతుంది.’’ అని అనంత లక్ష్మీ లేఖలో రాసింది.

అనంతలక్ష్మీ ఆత్మహత్యతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి.పోలీసులు శివకుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.