విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన హెచ్ సీ యూ ప్రొఫెసర్.. ఆందోళనలో విద్యార్థులు!

అమ్మాయిలపై రోజురోజుకు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.అయితే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని సక్రమమైన మార్గంలో నడిపించే ఉపాధ్యాయులు సైతం ఈ విధమైనటువంటి దారనాలకు వడి కట్టడం అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. హైదరాబాదులో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఉన్నత చదువుల కోసం థాయిలాండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ విద్యార్థి పట్ల హెచ్ సి యు ప్రొఫెసర్ అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే ఆయన నుంచి తప్పించుకున్నటువంటి ఆ విద్యార్థిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇంతటిపేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు భద్రత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

థాయిలాండ్ విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠినమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఎంతో మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడితే అది యూనివర్సిటీకి మాయని మచ్చగా ఏర్పడిందని ఇలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ పలువురు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.