చివరి కోరిక తీరకుండానే చనిపోయిన హరికృష్ణ

హరికృష్ణ మరణించిన తర్వాత ఆయన గురించి పలు విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అన్ని వర్గాలవారు ప్రసాతవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన తన చివరి కోరిక తీరకుండానే మరణించారంటూ సన్నిహితుల నుండి వినిపిస్తున్న మాట. ఇంతకీ ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసా? తెలియాలంటే కింద ఉన్న స్టోరీ చదవండి.

తమ తండ్రి హరికృష్ణ మరణంతో హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తండ్రి అంటే వారికి ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో చాలా సందర్భాల్లో తెలియజేశారు వాళ్ళు. మా నాన్నలాంటి గొప్ప కొడుకు ఎవరూ ఉండరు. మా తాత ఎన్టీఆర్ కి ఆయన చేసిన సేవ ఏ కొడుకు చేసి ఉండరేమో అని కళ్యాణ్ రామ్ పబ్లిక్ గా చెప్పాడు. ఇక ఎన్టీఆర్ కూడా తన ప్రతి సినిమా ఫంక్షన్ లో హరికృష్ణ గురించి చెబుతూనే ఉంటాడు.

ఆ తండ్రి కొడుకులు ఎంత అన్యోన్యంగా ఉంటారో చూస్తేనే తెలిసిపోతుంది. అటువంటివారిని తెరపై చూడాలి అనుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ హీరో నాగార్జున ఈ విషయాన్ని మీలో ఎవరూ కోటీశ్వరుడు ప్రోగ్రాంలో కళ్యాణ్ రామ్ తో ప్రస్తావించాడు కూడా. నాకు అన్నయ్యని(హరికృష్ణని) మల్లి సినిమాల్లో చూడాలని వుంది. మా ఫ్యామిలీ నుండి 3 జెనెరేషన్స్ మల్టీ స్టారర్ చేశాం. మిమ్మల్ని కూడా అలా చూడాలని వుంది. నువ్వు, తారక్ అన్నయ్య కలిసి ఒక సినిమా తీయొచ్చు కదా. అని అడిగాడు కళ్యాణ్ రామ్ ని. కళ్యాణ్ రామ్ స్పందిస్తూ తప్పకుండ చేస్తాం. ఒక మంచి కథ కోసం చూస్తున్నాం. మంచి కథతో ఎవరైనా డైరెక్టర్లు వస్తే నటించటానికి మేము రెడీ అని చెప్పాడు.

అయితే ఎంతో కాలంగా హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించాలి అనుకున్నారట. దీనికోసం సన్నాహాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. హరికృష్ణ కూడా కొడుకులతో కలిసి నటించాలని ఆశ పడ్డారట. ఈ త్రయం కలిసి నటించటానికి తగిన మంచి కథను రాయమని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇప్పటికే పలువురు రచయితలకు చెప్పినట్టు సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. కాగా హరికృష్ణ కొడుకులతో కలిసి నటించాలని ఎంతగానో ఆశపడ్డ చివరి కోరిక నెరవేరకుండానే ఆయన మరణించడం కళ్యాణ్ రామ్ ని, ఎన్టీఆర్ ని మరింతగా ఆవేదనకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.