పెద్ద కొడుకు గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న హరికృష్ణ

కళ్యాణ్ రామ్ నటించిన ఇజం మూవీ ఆడియో ఫంక్షన్లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రామ్ గురించి మాట్లాడారు హరికృష్ణ. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫంక్షన్ లో నా పెద్ద బిడ్డ జానకి రామ్ కూడా ఉండాల్సినవాడు. “నాన్నా ఇద్దరూ పటాస్, టెంపర్ సినిమాలతో హిట్స్ కొడతారు, ఖచ్చితంగా రెండు సినిమాలు హిట్ అవుతాయి” అని చెప్పాడు కానీ ఆ మరునాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు.

కానీ ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఆయన మాట ఇంకా జీవించి ఉంది. ఆయన దీవెనతోనే పటాస్, టెంపర్ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. పైనుంచి ఆ పెద్దాయన(సీనియర్ ఎన్టీఆర్) దీవెన, నా పెద్ద కొడుకు దీవెన ఉన్నాయి ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ పెద్ద కొడుకు మాటలు చెప్పి ఆవేదనకు లోనయ్యారు హరికృష్ణ.

ఎక్కడైతే తన పెద్ద కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఆ జిల్లాలోనే హరికృష్ణ కూడా బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్టీఆర్ అభిమానులను తీరని బాధకు గురిచేస్తున్నది. ఒకే జిల్లాలో హరికృష్ణ, ఆయన పెద్ద కొడుకు ప్రమాదంలో చనిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు కూడా.