నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఒక ఆడియో ఫంక్షన్లో హరికృష్ణ మనసు విప్పి మాట్లాడారు. తన జీవితంలోని మధురమైన అనుభూతుల్ని పంచుకున్నారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
నా వయస్సు 60 ఏళ్ళు. 60 ఏళ్ళ జీవితంలో హరికృష్ణ ఏం చేసాడు? ఎలాంటి అనుభూతుల్ని పొందాడు? జీవితంలో ఎవరూ పొందలేని, ఎవరూ అనుభవించలేని ఆనంద సమయాలు పొందాను. ఒక మహానుభవుడు, నందమూరి రామారావు గారి దగ్గర ముప్పయేళ్లు పని చేశాను నేను. హిమాలయ శిఖరాన్ని మించిపోయేటటువంటి గొప్ప అనుభూతిని పొందినవాణ్ణి నేను.
ఆయనతో ఎన్నో విషయాలు చూశాను, ఎన్నో పోరాటాలు చూశాను. సినిమా రంగంలో ఆయన విజయాన్ని చూశాము, ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి అందులోనూ ఆయన విజయాన్ని చూశాము. వారి దగ్గర నుండి పొందినది ఏంటంటే ఎనలేని నందమూరి వంశ వీరాభిమానుల్ని పొందాము. వెలకట్టలేని, తస్కరించలేని గొప్ప అభిమానాన్ని పొందాము.
బిడ్డల్ని కనడం కూడా గొప్ప అనుభూతే. నా 59 వ యేట నేను పొందిన అనుభూతి నా కొడుకులిద్దరి సినిమాలు (పటాస్, టెంపర్) హిట్ అవడం చూశాను. నా 60 వ యేట నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ హిట్ అయింది. అది నా 60 వ బర్త్ డే గిఫ్ట్ అని ఎన్టీఆర్ చెప్పడం నాకు ఆనందం. ఇక 60 వ సంవత్సరంలో ఉన్నప్పుడు నా రెండో కొడుకు కళ్యాణ్ రామ్ మరో సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు. ఈ సినిమా హిట్ అవడం నాకు ఒక బహుమతి అంటూ తన 60 ఏళ్ళ జీవితంలోని సంతోషకరమైన విషయాలను వెల్లడించారు హరికృష్ణ.