(ధ్యాన్)
నందమూరి హరికృష్ణ మంచి భోజనప్రియుడు. తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సర్వదేవతా ఆరాధనను పూర్తి చేసుకున్నాక ఆయన ఉదయాన్నే టిఫిన్ తీసుకునేవారు. టిఫిన్ శాకాహారాన్నే తీసుకోవడానికి ఇష్టపడేవారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనంలో మాత్రం గారెలు, కోడికూర తప్పకుండా ఉండేలా చూసుకునేవారట. సాయంత్రం రొయ్యల డ్రై ఫ్రైని, పకోడీని ఇష్టపడేవారట. సాయంత్రం వేళల్లో చేపల పులుసును ఇష్టంగా తీసుకునేవారట. చేపలను ఫ్రై చేయడం కన్నా, పులుసు పెడితేనే బావుంటుందని ఆయన భావమట. స్వయంగా కొన్ని సార్లు వంట కూడా చేసిపెట్టేవారని అభిమానులు అంటున్నారు. భోజనం వేళకు ఎంత మంది వెళ్లినా, అందరినీ కూర్చోపెట్టి వడ్డించడంలో ఆయనది ఎముకలు లేని హస్తం అని సన్నిహితులు అంటున్నారు.