పెళ్లి మండపం నుంచి పెళ్లి కొడుకు పరార్, రోధిస్తున్నపెళ్లికూతురు

..
 
*పీటల వరకు వచ్చిన పెళ్లికి, పెళ్లి కొడుకు పరారీతో లబోదిబో అంటున్న వధువు తల్లిదండ్రులు*
 
*తల్లిదండ్రుల మాట విని పెళ్లి కొడుకు పరారయ్యాడాని ఆరోపిస్తున్న యువతి బంధువులు*
 
*కారణాలు చెప్పకుండా పరారైన పెళ్లి కొడుకు పై చర్యలు తీసుకోవాలని తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బాధిత యువతి తల్లిదండ్రులు*
 
రాత్రి 12 గంటల సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు, తోట్లవల్లూరు మండలం ఘటన

అసలేం జరిగిందంటే

      తోట్లవల్లూరు మండలం రోయ్యూరు గ్రామానికి చెందిన మే రుగ నాగార్జున పెద్ద కుమార్తె దివ్య కు పామర్రు మండలం లో నీ నిబానుపూడి గ్రామానికి చెందిన అరిసే రామారావు 3 వ కుమారుడు నాగ శ్రీను తో వివాహం జరుపుకునేందుకు పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నారు . జూన్ నెలలో 22 వ తేదీన రోయ్యురు లో ఇరువురికి ఎంగాజ్ మెంట్ జరిగింది.

 

కట్నం 1 లక్ష ఇచ్చారు. పెళ్లి సెప్టెంబర్  2 న రాత్రి 9.51 కి ముహూర్తం పెట్టుకొన్నారు. పెళ్లి కుమార్తె దివ్య విజయవాడ లో ఓ ప్రైవేట్ షాప్ లో పని చేస్తుంది. ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి కొడుకు నాగ శ్రీను రోజు, దివ్య షాప్ వద్దకు వెళ్ళటం. షాప్ లో పని పూర్తి ఐన తరువాత దివ్య ను రొయ్యూరు లో ఆమె ఇంటివద్ద దింపి వెళ్ళేవాడు. ఈ క్రమంలో రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేస్తే దివ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. తెల్లవారు ఝామున 2 గంటల వరకు చాటింగ్ లో ఉంటున్నట్లు అనుమానం తో దివ్య మొబైల్ లో కెనక్షన్ మేనేజేర్ అనే యాప్ వేశాడు. తద్వార దివ్య మొబైల్ లో ఎవరితో మాట్లాడినా నాగ శ్రీను కు తన మొబైల్ లో తెలిసి పోతుంది. తనకు తెలియకుండా తన మొబైల్ లో యాప్ వేశాడని తెలుసు కున్న దివ్య నాటినుండి నాగ శ్రీను, వారి కుటుంబ సభ్యుల ఫోన్ లు లిఫ్ట్ చేయటం మానివేసింది.

 

దీంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఆగస్ట్ 29 న రాత్రి 1.30 గంటల సమయంలో రొయ్యురు వెళ్ళి జరి గిందేదో జరిగి పోయింది పెళ్లి చేద్దాం అని చెప్పారు. ఈ సమయంలో మాట్లాడటం సరికాదు రేపు మా బందువులు, పెద్దల తో వచ్చి మాట్లాడతామని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు చెప్పారు. పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఈ విధంగా అనుమానిస్తే, పెళ్లి తరువాత పిల్లకు రక్షణ ఏమిటి అని ప్రశ్నించారు. దీంతో జరిగిన వన్ని వదిలేసి పెళ్లి చేద్దామని పెళ్ళికొడుకు తరపువారు కోరారు. ఈ వివాదం రెండు కుటుంబాల మధ్య పంతాలకు దారి తీసింది.

 

 

 
 

ఈ ఘటన పై బాధితురాలు దివ్య తోట్లవల్లూరు పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దివ్యకు మద్దతు గా 200 మంది గ్రామస్తులు తోట్లవల్లూరు పోలీసు స్టేషన్ కు వచ్చారు. పోలీసు అధికారులు సమక్షం లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పెళ్లికి తాను సిద్ధమే నని కాని నాకు తెలియకుండా నా ఫోన్ లో యాప్ వే యటం తో బాధ కలిగిందని దివ్య చెప్పింది. ఐతే నాగ శ్రీను ఫోన్ కు స్పందించక పోవటం. తెల్లవారు ఝాము వరకు చాటింగ్ లో వుండటం వలన యాప్ వేసినట్లు ఒప్పుకున్నాడు. ఐతే తాను పెళ్లికి మాత్రం నిరాకరించాడు .

 

దివ్య తో వివాహం జరగాలంటే. జూన్ 22 నుండి ఈ రోజు వరకు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్, మెడికల్ రిపోర్టు తెప్పిస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాలు వాదోపవాదాలు జరిగాయి. పెళ్లి లేదా కేస్ రెండింటిలో ఏదో ఒకటి తేల్చు కోవాలని పెళ్లి కుమార్తె దివ్య కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

 

పెళ్లికి ససేమిరా అన్న నాగ శ్రీను కేస్ కు సిద్ధమే అనటం బాధితులకు ఆగ్రహం తెప్పించింది. బాధితుల ఫిర్యాదు పై లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసు లు చెప్పటం తో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు .

 

దీంతో రాత్రి 12 గంటల సమయంలో కేసు నమోదు చేశారు. బాధితురాలు 11 మంది పై ఫిర్యాదు చేసింది. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వున్నట్లు సమాచారం. ఐతే పెళ్లి కొడుకు నాగ శ్రీను విజయవాడ గాయత్రి నగర్ చైతన్య కళాశాల లో  ట్యూటర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఫిర్యాదు లో పేర్కొన్నవారందరిని  అరెస్ట్ చేసి కోర్టుకు పంపేవరకు  స్టేషన్ ఎదుట బైఠాయిస్తామని గ్రామస్తులు అంటున్నారు.