కుప్పకూలిన మాజీ స్పీకర్ (వీడియో)

మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ కె .ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. ఆమెకు విశాఖపట్టణంలోని పినాకిిని ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.  ఈ సంఘటన కొద్ది సేపటి కింద విశాఖ లోని ఇదే అసుపత్రిలో జరిగింది. అనారోగ్యంతో ఉన్న తండ్రి జస్టిస్(రిటైర్డు) పున్నయ్య (92)ను  చూసేందుకు ఆమె  ఆసుపత్రికి వచ్చారు. అయితే, తండ్రిని చూసి చూడగానే  ఆమె  ఒక్కసారిగా కుప్పకూలారు.దీంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమై అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిభాభారతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు షాక్ తో గుండెపోటు వచ్చినట్లు  డాక్టర్లు గుర్తించారు.  అయితే, ఆమెకు చికిత్స కొనసాగుతూ ఉంది. పూర్తి వివరాలు అందాల్సి వుంది.