పాలమూరు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కుటుంబంలో విషాధం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు నాగం దినకర్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు.
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో దినకర్ రెడ్డి గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
దినకర్ మరణంతో నాగం కుటుంబంలో విషాధం అలముకున్నది. నాగం కుటుంబసభ్యులతోపాటు నాగం అనుచరులు, అభిమానులను ఈ వార్త శోక సముద్రంలో ముంచెత్తింది.
నాగం దినకర్ రెడ్డి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆ వ్యాధి తీవ్రమైంది. అపోలోకు తరలించి చికత్స అందించినా ఆయనకు నయం కాలేదు.
నాగం జనార్దన్ రెడ్డికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి పెద్ద కొడుకైన దినకర్ వ్యాపార రంగంలో ఉన్నారు. చిన్న కొడుకు నాగం శశిధర్ రెడ్డి ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తున్నారు. నాగం కూతురు , అల్లుడు ఇద్దరు కూడా డాక్టర్లే.
దినకర్ మాత్రం వైద్య రంగం వైపు వెళ్లలేదు.
నాగం పెద్ద కొడుకు మరణంతో నాగర్న కర్నూలులో విషాధం అలముకున్నది.