మల్లారెడ్డి కాలేజిలో విద్యార్ధిని సూసైడ్ అటెంప్ట్

మేడ్చల్ లోని గండి మైసమ్మ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ సెకండియర్ చదువుతున్న సంధ్య అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సంధ్య గురువారం ఉదయం హాస్టల్ లోని 4 వ ప్లోర్ నుండి కిందకి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. విద్యార్ధిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంధ్య

విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉండటంతో సూరారంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  విద్యార్ధినికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా లేక కుటుంబ సమస్యలా, కాలేజిలో ఎవరైనా వేధింపులకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  కళాశాల అధ్యాపకుల వేధింపుల వల్లనే సంధ్య ఆత్మహత్యాయత్నంకు పాల్పడిందని పలు  విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

విద్యార్ధిని ఆత్మహత్యకు యత్నించింది ఈ బిల్డింగ్ నుంచే