ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇందుకు సంబంధించి 500 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించడంతో పాటు గ్రూప్ డిసషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
29 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 63,840 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. https://bankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు ఏకంగా 850 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.