ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.46,000 వేతనంతో జాబ్స్..!

బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. టెక్నీషియన్స్, ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. నేషాల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ కోసం ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. త్వరలో ఉద్యోగ ఖాళీల సంఖ్యకు సంబంధించి స్పష్టత రానుంది.

ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ ల్యాబ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉద్యోగ ఖాళీలకు అర్హతలతో పాటు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హత, అనుభవంకు సంబంధించి మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 46,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. hr.bengaluru@becil.com వెబ్ సైట్ లింక్ కు అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది. https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.