తెలంగాణలో అట్టుడుకుతున్న న్యూస్ : అత్త చేసిన పని తట్టుకోలేక అల్లుడు సూసైడ్ ??

అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు అత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా అత్తిండి వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకుందనే వార్తలను మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ అత్తింటి వేదింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని అందరూ షాక్‌కు గురువుతున్నారు.

ఎక్కడ, ఏం జరిగింది?
వరంగల్ ఆటోనగర్, తుమ్మలకుంటకు చెందిన పిండి దేవేందర్‌ (25)కు సంగెం మండలం కోట వెంకటాపూర్‌కు చెందిన న్యాల అనూష అలియాస్‌ లావణ్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంత కాలం నుంచి అత్తగారి ఇంట్లో వారితో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న అత్త న్యాల రాజమ్మ, బావమరిది అనిల్, భార్య అనూష వారి బంధువులు న్యాల బుచ్చయ్య, రవి, ప్రసాద్‌లు దేవేందర్ ను చెట్టుకు కట్టేసి, బూతులు తిట్టుతూ కొట్టారు.

ఈ ఘటన తో మనస్తాపం చెందిన దేవేందర్‌ అప్పటి నుంచి మానసికంగా చాలా బాధ పడుతున్నాడు. 16వ తేదీన పిల్లలను చూసి వస్తానని ఇంట్లో చెప్పి అత్తగారింటికి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక అత్తింటి వారు పిల్లలను చూపించకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావని అవమానపరిచారు.

దీంతో మనస్తాపానికి గురైన దేవేందర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు. కాలిన గాయాలతో ఉన్న దేవేందర్ ను స్ధానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తునానరు.