కొందరు పోలీసులు ఎప్పుడేం చేస్తరో ఎవరికి అర్థం కాదు. ఉత్త పుణ్యానికే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక సిఐ తెగ రెచ్చిపోయారు. ఉన్నట్లుండి ఒక కాంగ్రెస్ కార్యకర్తను ఇసిరి ఇసిరి కొట్టిండు. ఎందుకు అతన్ని టార్గెట్ చేసి కొట్టిండో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ కార్యకర్తను అవమానకరంగా అందరిముందుకొట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వివరాలు, వీడియో కింద ఉన్నాయి చూడండి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై సోమవారం బంద్ జరిగింది. ఈ బంద్ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆర్టీసీ బస్ డిపో దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు సామరస్యంగా నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో నాగర్ కర్నూలు సిఐ మెరుపు వేగంతో వచ్చారు అక్కడికి. ఆ సమయంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తను పట్టుకుని ఇటు అటూ నూకేస్తూ దాడి చేశారు. సిఐ చేతిలో దాడికి గురైన కార్యకర్త పేరు సుల్తాన్. ఆయన గ్రామం నాగనూల్.
సిఐ అందరినీ వదిలేసి ఒక యువకుడిని టార్గెట్ చేసి ఎటాక్ చేయడం పట్ల కాాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఆ యువకుడిని టార్గెట్ చేశాడని వారు నిలదీస్తున్నారు.