జైళ్ల శాఖ డిజికి సిగ్గుందా : కాంగ్రెస్ దాసోజు శ్రవణ్

తెలంగాణ జైళ్ల శాఖ  డిజి వినయ్ కుమార్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని  కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ విమర్శించారు. చంచల్ గూడ జైలు నుంచి పట్నాకు టేకు తరలించినందుకు హెచ్ ఎంటీవి మీడియా సంస్థ దానిని ప్రసారం చేసింది. డిజి చేసిన తప్పును యధావిధిగా మీడియా చూపించింది.  దానిలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

సిగ్గులేకుండా మీడియా సంస్థను కించ పరుస్తూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. మీడియా హౌస్ ను సెక్స్ వర్కర్ అంటారా అని ప్రశ్నించారు. మీడియా  సంస్థను కించపరుస్తూ ప్రకటన విడుదల  చేయడానికి బుద్ది ఉండాలన్నారు. ఇవాళ వినయ్ కుమార్ మాట్లాడిన మాటలు హెచ్ ఎంటీవి నే కాదు అన్ని మీడియా సంస్థలను అన్నటువంటి మాటలుగా పరిగణిస్తున్నామన్నారు. అధికారులు యధా రాజా తథా రాజా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.

గతంలో కూడా కేసీఆర్ ఒక పత్రిక రిపోర్టర్ ను వంద అడుగుల లోతుకు పాతిపెడుతానని అంటే ఈ రోజు జైళ్ల శాఖ డిజి వినయ్ కుమార్ మీడియా సంస్థలను అవమానించేలా మాట్లాడిన విధానం చూస్తే రౌడియిజం కనిపిస్తుందన్నారు. నిజంగానే తప్పు చేయకుంటే వినయ్ కుమార్ జర్నలిస్టు సంఘాలకు, ప్రెస్ కౌన్సెల్ కు ఫిర్యాదు చేయాలన్నారు. డిజిపి తక్షణమే వినయ్ కుమార్ పై చర్య తీసుకోవాలన్నారు. వినయ్ కుమార్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘానికి గులాబీ చీడ పట్టిందని, తెలంగాణలో ప్రజాస్వామిక ఎన్నికలు జరుగవని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలే సాక్ష్యమన్నారు. తాము ఎంత మెత్తుకున్నా పోలింగ్ బూత్, బ్యాలెట్ పేపర్ లకు గులాబీ రంగు కావాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల సంఘం గులాబీ పార్టీకి గులాంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా పై అణచివేత ధోరణి వ్యవహరిస్తోందన్నారు.