గ్రామదర్శినిలో శివాలెత్తిన చింతమనేని, బూతు పురాణం (వీడియో)

టీడీపీ ఫైర్ బ్రాండ్లలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఆయనకి ఉన్న దూకుడు వ్యవహారంతో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ దూకుడు వలెనే ఆయన రాజకీయాల్లో ఎదిగారు అని కొందరు అంటూ ఉంటారు. ఈయనకు కోపం కూడా ఎక్కువే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఈ కోపం వలన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు చింతమనేని.

దెందులూరు నియోజక వర్గం కొండలరావుపాలెం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు చింతమనేని. గ్రామదర్శినిలో ఆయన మాట్లాడుతుండగా మైక్ సరిగా పని చేయకపోవడంతో శివాలెత్తిపోయారు. కోపాన్ని అణుచుకోలేక ఆ మైక్ విసిరికొట్టి బూతులు తిట్టడం ప్రారంభించారు. ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ, ఇలాగేనా చేసేదంటూ టీడీపీ కార్యకర్తలపై, నిర్వాహకులపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు.

ఇదంతా వీడియోలో బంధించి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఏ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక ప్రజా ప్రతినిధి పబ్లిక్ గా సహనం కోల్పోయి అలా బూతు పదాలు వాడటంపై పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.