అప్పు తీర్చకపోతే వ్యభిచారం చేయిస్తా, కాల్ మనీగాడి బెదిరింపు

సద్దుమణిగినట్టే కనిపించిన కాల్ మనీ భూతం మళ్లీ తలెత్తింది ఆంధ్రలో. విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ కాల్ మనీ మహిళ పాలిట శాపం గా మ ారింది. అత్యవసరమయిన పుడు కాల్ మనీ కింద అప్పు తీసుకుని, ఎంత కట్టినీ తీరని ఈ అప్పులతో నరకం అనుభవిస్తున్నారు.అపుతీర్చలేకపోతు, నిన్నెత్తుకుపోయి వ్యభిచారం చేయించి డబ్బు వసూలు చేసుకుంటానని బెదిరించి కాల్ మనీగాడి వ్యవహారం ఒకటి పోలీసులకు అందింది. 

 

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో  ఒక  కాల్ మనీ వ్యాపారి తనని  లైంగికంగా వేదిస్తున్నారంటు జిల్లా పోలీసు కార్యాలయం అధికారులకి  తెహరున్నిసా అనే మహిళ ఫిర్యాదు చేసింది.

తీసుకున్న అసలు అప్పు డబ్బుల కన్నా ఎక్కువ వడ్డీ కట్టినా రుణం తీరడం లేదని, తీర్చే కొద్దిరుణం పెరుగుతూ ఉందని ఆమె వాపోతున్నది.

మచిలీపట్నంకి చెందిన వడ్డీ వ్యాపారీ రామ్ కుమార్ దగ్గరి నుంచి  తన అడపడుచు సహయంతో లక్ష ముప్పై వేలు తెహరున్నీసా అప్పు  తీసుకున్నది.

నెలకు 9,500 చొప్పున నాలుగు సంవత్సరాలు లు వడ్డీ రూపంలో చెల్లించింది. గత నాలుగు నెలల నుండి అర్దిక ఇబ్బందులు లో వడ్డీ కట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నది.

వడ్డీ వ్యాపారి రామ్ కుమార్ కి తోడు తన అడపడుచు కూడా డబ్బులు కట్టాలని వేధిస్తున్నదని ఆమె ఆరోపిస్తున్నది.

 వడ్డీ డబ్బులు కట్టక పోతే నిన్ను తీసుకుని వెళ్ళి వ్యభిచారం చేయించి నా వడ్డీ డబ్బులు తీసుకుంటానని రామ్ కుమార్ మహిళ పట్ల అసభ్యకరమైన పదజాలం తో వేధిస్తున్నాడు.

  మా ఓదిన తో సహా పోలీసు హోంగార్డు మరొక  ఐదుగురు వ్యక్తులు వచ్చి నన్ను ఇంటిలో హౌ అరెస్టులో ఉంచారని, తెల్లకాగితం మీద సంతకం చేయ్యాలని ఒత్తిడి చేసి ఇంట్లో ఉన్న బిరువాను పగలుకోట్టి డబ్బులు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశారని ఆమె పోలీసులకు నివేదించింది.

‘గత నాలుగు సంవత్సరాల నుండి నూటి కి పది రూపాయల వడ్డీ చోప్పున కట్టుకుంటు వచ్చాను ఇంక నేను కట్డలేను.  కష్టాలొచ్చి నేను చచ్చే పరిస్థితులు లో ఉన్నాను. నాకు పోలీసులు న్యాయం చేయ్యాలి, అని ఆ మహిళ ఈ రోజు జిల్లా పోలీసు అధికారులు కలిసి మొరపెట్టుకుంది.