బెజవాడలో కాల్ మనీ వేధింపుల కలకలం మొదలయింది. ఆ మధ్య కాల్ మనీ భూతం లా బెజవాడ నువణికించింది. అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు కాల్ మనీ వ్యాపారంలో పేదలను హింసించడం, చాలా మంది వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రాన్ని కుదిపేసింది. అయితే, తూ తూ మంత్రంగా సాగిన విచారణ, కొన్ని అరెస్టులు, అధికార పార్టీ పరువు పోతున్నదనే భయంతో కొద్ది రోజులు అందరికీ అంగీకారంతో ఈ సమస్యను తొక్కిపెట్టేశారు. కేసులేమయ్యాయో ఎవరికీ తెలియదు.
ఇపుడ మళ్లీ కాల్ మనీ రాక్ష సత్వం దాడి చేసింది. రెండు లక్షలు అప్పు ఇచ్చి సంవత్సరాలు వడ్డీలు గుంజీ, కట్టలేని పరిస్థితి వచ్చినా కనికరించకుండా… ఇపుడ20 లక్షలు బకాయీ కట్టాలని వేధిస్తు న్న పైశాచికత్వం విజయవాడలో ప్రత్యక్షమయింది. ఈ వేధింపులు భరించలేక అసలే గుండెజబ్బుతో ఉన్న బాధితుడు ఇజ్రాయేల్ ఆసుప్రతి పాలయ్యాడు. 2 లక్షల అప్పుకి 20 లక్షలు కట్టాలని వేధింపులు, దాడి గుండె పోటుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన బాధితుడు ఇజ్రాయెల్,
పరిస్థితి విషమించడంతో సోమా గోపాల కృష్ణ మూర్తి తమని వేధిస్తున్నారని బాధితుడి భార్య సౌసల్య ఆరోపణ చేసింది. చెక్కులు, నోట్లు రాయించుకుని వేధిస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయింది. ఈ నెల 6న సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే, వాళ్లు బాధితుడి మీద చర్య తీసుకుని పేదల అండగా నిలబడకుండా రాజీ చేసుకోవాలని చెబుతున్నారని బాధితుల ఆవేదన చెందుతూ ఉంది.
కాల్ మనీ ఆపరేటర్ల పలుకుబడి ఎంత ఉందో చూడండి. పోలీసులిలాంటి సలహా ఇచ్చారంటే వారెంత బలవంతులో అర్థమవుతుంది.