Crime News: మరణం ఎప్పుడు ఎవరిని ఎలా కబలిస్తోందో ఊహించలేరు. నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. తండ్రి చేపిస్తున్న ఇంటి పని చూడటానికి ఎంతో సంతోషంగా వెళ్ళిన విద్యార్థి అనుకోని ఘటన జరగడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాకలో చోటు చేసుకుంది. కళ్ళ ముందరే కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు .తన కొడుకు చావుకు కారణం అంటూ ఆ తండ్రి రోదించాడు. ఇంటి దగ్గర ఉన్న కొడుకుని తనతో పాటు తీసుకువచ్చి తన కొడుకు చావుకు కారణం అయ్యానని నా తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు.
నర్సింగ్‌రావు అనే వ్యక్తి సెంట్రింగ్ పనులు కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటాడు. నర్సింగ్ రావు కుమారుడు విజయ్ కుమార్ ఇంటర్ చదువుతున్నాడు. తన తండ్రి కాంట్రాక్టు తీసుకొని పనులు చేయిస్తున్నారు ఇంటి వద్దకు తన తండ్రితో కలిసి వెళ్ళాడు. నర్సింగరావు సెంట్రింగ్ పనులు కాంట్రాక్టు తీసుకొని సెంట్రింగ్ విప్పుతుండగా ఒక్కసారిగా క్లబ్ కూలిపోయి విజయ్ కుమార్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన విజయ్ కుమార్ ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. సెంట్రింగ్ ప్రాంతంలో పనిచేస్తున్న వర్కర్లు తప్పించుకో గా విజయ్ కుమార్ మాత్రం మృత్యువాత పడ్డాడు.
అక్కడ పనిచేస్తున్న వర్కర్లకు చిన్న చిన్న గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవటం, పనిచేసే సమయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు తనతో పాటు ఉన్న కొడుకు క్షణాలలో లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడని ఆ తండ్రి రోదన వర్ణనాతీతం. కుమారుడి మరణంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.