ఉప్పల్‌లో చిన్నారిని ఢీకొన్న ఆటో (వీడియో)

అతి వేగం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి నడుచుకుంటూ వెళుతున్న కుటుంబాన్ని ఢీకొట్టడంతో ఓ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే కుమారుడు విగత జీవిగా మారడంతో తండ్రి కొడుకును ఎత్తుకొని రోధిస్తున్న తీరు స్థానికులను కలిచి వేసింది. ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్ లో జరిగింది. ఆటో ప్రమాదం జరిగిన వీడియో కింద ఉంది చూడండి. కింది లింక్ పై క్లిక్ చేయండి వీడియో వస్తుంది.

 

https://youtu.be/7E2r4TM3TOQ

రామాంతపూర్ లో నివసించే ఉమేష్ తన భార్యాపిల్లలతో కలిసి కిరాణం షాపుకు బయలుదేరాడు. ఉమేష్ కుమారుడు మోహిత్ తో కలిసి ముందు నడుస్తుండగా అతని భార్య, రెండో కుమారుడు వెనుకంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఎదురుగా రోడ్డుపై ఓ ఆటో వేగంగా వచ్చింది. రోడ్డుపై వెళుతున్న బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఆటోను కట్ చేయగా అదుపుతప్పి వీరిపైకి దూసుకు వచ్చింది. ఆటో బలంగా తగలడంతో ఉమేష్ అల్లంత దూరం ఎగిరి పడ్డాడు. మోహిత్ ఆటోకు, పుట్ పాత్ కు మధ్య నలిగిపోయాడు. ఘటనా స్థలంలోనే మోహిత్ ప్రాణాలు కోల్పోయాడు.

ఆటో డ్రైవర్ తాగిన మత్తులో ఆటో నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చిన్నారిని పట్టుకొని తల్లిదండ్రులు ఏడ్చిన ఘటన స్థానికులను కలిచి వేసింది. ఆటో డ్రైవర్ శివను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.