చేతిలో బాంబు పట్టుకొని పేలుస్తుండగా చేయి తెగిపడ్డది (వీడియో)

దీపావళి రోజు చేతిలో పట్టుకొని బాంబులు పేల్చడం వల్ల భారీ ప్రమాదాలే జరిగే అవకాశముంది. ఓ వ్యక్తి చేతిలో పట్టుకొని బాంబు పేలుస్తుండగా బాంబు చేతిలోనే పేలి అతని చేయి ఊడిపడింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన వారంతా ఖంగుతిన్నారు. వ్యక్తి బాంబు పేలుస్తుండగా చేయి తెగిన వీడియో కింద ఉంది చూడండి. 

https://youtu.be/zli2kQGQbxs

 

అందుకే బాంబులైనా, చిచ్చు బుడ్లైనా నేల పై పెట్టే పేల్చాలని అధికారులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువులు కూడా శబ్దాలకు భయపడుతాయని వాటికి దూరంగా బాంబులు కాల్చేలా చూసుకోవాలి. ముఖ్యంగా మనుషుల మధ్య ఉండే పశువులు, కుక్కలు, ఇతర జంతువులకు హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోని దీపావళి సంబరాలు చేసుకోవాలని అధికారులు తెలిపారు.