బాలయ్య ఫాన్స్ ఏం చేశారో చూడండి…

తెలుగుహీరో బాలయ్య కు పెద్ద అభిమాన సైన్యం ఉంది. ఆయన పుట్టిన రోజంటే వారందరికి పండగే. కాని మరీ బాలయ్య కొడుకు పుట్టిన రోజని కూడా గొడవ చేస్తే ఎలా?

కంచికచర్లలో అదే జరిగింది. అక్కడ తెలుగు తమ్ముళ్లు ఎంత అత్యుత్సాహం చూపారంటే చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

బాలకృష్ణ కుమారుడి పుట్టినరోజు అంటూ అనుమతి లేకుండా అమృత సాయి అనే ఇంజినీరింగ్ కళాశాలలో టీడీపీ తమ్ముళ్లు చొరబడ్డారు. హల్ చల్ చేశారు..

మద్యం తాగి, సెక్యూరిటీ గార్డులపై దౌర్జన్యం చేశారు. కళాశాల లో బైకులు, కార్లతో రౌండ్లు గొట్టి, హార్న్ వాయించి హడావిడి చేసి విద్యార్థులను, స్టాఫ్ను భయబ్రాంతులకు గురి చేశారు. 

తమ హీరో కొడుకు పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నామంటూ కళాశాలకు చెందిన పలు ప్రాపర్టీని ధ్వంసం చేసారు.

చివరకు యాజమాన్యంతరఫున ప్రిన్సిపల్  పోలీసులకు  ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు.

కళాశాలోలోకి చొరబడిన 18 బైకులు, 6 కార్ల నంబర్లు ఇచ్చి ఫిర్యాదు చేశారు.

పోలీసుల కేసు నమోదు చేశారు.