బీహార్ రాష్ట్రంలో దారుణం.. చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని దారుణంగా చంపిన అన్న.. ఆ తర్వాత ఏ చేశాడంటే..?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చిన్నవయసులోనే ప్రేమలో పడుతున్నారు. ఇలా ఏమి తెలియని వయసులో ప్రేమలో పడి కొంతమంది యువతులు అబ్బాయిల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. అందువల్ల ఆడపిల్లల ప్రేమ విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతూ కోపంలో దారుణాలకి పాల్పడుతున్నారు. ప్రేమించిన పాపానికి వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన బీహార్లో చోటుచేసుకుంది. చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని ఒక అన్న దారుణంగా నరికి చంపటమే కాకుండా అతని శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కలకు ఆహారంగా వేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని నలందకు చెందిన రాహుల్ కుమార్(19) అనే వ్యక్తి చెల్లి.. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బిట్టు కుమార్ (20) అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తన చెల్లి ప్రేమ విషయం తెలుసుకున్న రాహుల్ కుమార్ ఆమెను బిట్టు కి దూరంగా ఉండమని వారించాడు. అయితే యువతి తన అన్న మాటలను లెక్క చేయకుండా బిట్టు తో కలిసి ఏకాంతంగా ఉంది. ఇలా తన చెల్లి ప్రేమించిన వాడితో ఏకాంతంగా ఉండటాన్ని గమనించిన రాహుల్ కుమార్ అప్పటి నుంచి బిట్టుపై కోపం పెంచుకుని తనని ఎలా అయినా చంపాలి అని నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు.

ప్లాన్ ప్రకారం ఓ రోజు తన చెల్లి ఫోన్‌తో బిట్టుకు ఫోన్ చేసి కలవాలని పిలిచాడు. బిట్టు వచ్చాక.. రాహూల్ తన ఫ్రెండ్‌తో కలిసి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ బిట్టును దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత బిట్టు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కొన్ని వీధి కుక్కలకు పడేసి మిగిలిన శరీర భాగాలు నదిలో పడేశాడు. అయితే రాత్రి పొద్దుపోయిన కూడా బిట్టు ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మొదట మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిట్టు ఫోన్‌ను ట్రేస్ చేయగా రాహుల్ దగ్గర ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు రాహూల్‌ను తనదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.