మహారాష్ట్రలో దారుణం…కానిస్టేబుల్ చేతిలో ఎస్ఐ దారుణ హత్య…?

సాధారణంగా మనుషులు ఒకరి మీద ఒకరు కోపం పెంచుకోవడం వల్ల తరచూ వారితో గొడవ పడటమే కాకుండా వారి మీద దాడికి దిగుతూ ఉంటారు. మరి కొంతమంది ఇతరుల మీద ఉన్న కోపంతో వారి మీద కక్ష పెంచుకొని హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్రమశిక్షణ పరంగా కానిస్టేబుల్ మీద ఎస్ఐ చర్యలు తీసుకోవడంతో ఆ కానిస్టేబుల్ ఎస్సై మీద కక్ష దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలలోకి వెళితే … ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మీద కానిస్టేబుల్ దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల అంబర్ నాథ్ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బస్వరాజ్ గార్గ్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తన బ్యారక్ లో విగతజీవిగా పడి ఉండటాన్ని కళ్యాణ్ ఏసీసీ ఉమేష్ మానే పాటిల్ గుర్తించాడు. దీంతో వారిపై అధికారులతో పాటు బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశాడు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఎస్ఐ బస్వరాజ్ గార్గ్ గతంలో పంకజ్ యాదవ్ అనే కానిస్టేబుల్ ని క్రమశిక్షణ పేరుతో మందలించినట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడుఅందరి ముందు ఎస్ఐ తనని మందలించటంతో పంకజ్ యాదవ్ ఎస్ఐ మీద కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా తన కక్ష తీర్చుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు బుధవారం విధులలో ఉన్న బస్వరాజ్ గదిలోకి దూరి అతని మీద కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పంకజ్ యాదవ్ తన నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు కానిస్టేబుల్ పంకజ్ యాదవ్ మీద కేసు నమోదు చేసుకొని రిమాండ్ కి తరలించారు.