పెళ్లి చేసుకున్న విషయం దాచి మరో పెళ్లి చేసుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమ పేరుతో చాలా సులభంగా మోసం చేస్తున్నారు. ప్రేమ పేరు చెప్పి వారిని వలలో వేసుకొని పెళ్లి చేసుకుని వదిలేస్తున్నారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నా కూడా అమ్మాయిలు మాత్రం ప్రేమ పేరుతో గుడ్డిగా మోసపోతున్నారు. అంత అయిపోయిన తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మహిళ ఒక యువకుడి మోజులో పడి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకొని అతని చేతిలో దారుణంగా మోసపోయింది. డబ్బు బంగారు పోగొట్టుకొని ఇప్పుడు పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గా రెడ్డి అనే యువతి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో కరీంనగర్ కి చెందిన ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. అయితే కొంతకాలానికే షారుక్ అలీ దుర్గారెడ్డిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఆమె లేకపోతే చనిపోతానని బెదిరించాడు. దుర్గారెడ్డి షారుక్ అలీ తనని ప్రేమిస్తున్నాడని గుడ్డిగా నమ్మింది. నీ కోసం నా మతం కూడా మార్చుకుంటాను అని దుర్గా రెడ్డీ ని నమ్మించాడు. ఆ సమయంలో దుర్గారెడ్డి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ వాటన్నిటినీ తిరస్కరించి పెద్దలను ఎదిరించి షారుక్ అలీతో వివాహానికి సిద్ధపడింది. ఇంట్లో ఉన్న బంగారు నగలు డబ్బు తీసుకొని వచ్చి షారుఖ్ అలీ ని వివాహం చేసుకుంది.

అయితే షారుక్ అలీ దుర్గారెడ్డిని వివాహం చేసుకోవడానికి గతంలో తనకి వివాహమైన సంగతి ఆమె వద్ద దాచి ఉంచాడు. దుర్గారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె వద్ద ఉన్న నగలు డబ్బులు ఖర్చు చేశాడు. అయితే పెళ్లి జరిగిన కొంతకాలానికి షారుక్ అలీ ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన దుర్గారెడ్డి తాను మోసపోయినట్లు తెలుసుకొంది. ఈ విషయమై భర్తను నిలదీయగా అలీ నిజాన్ని ఒప్పుకొని మొదటి భార్య పిల్లలతో పాటు అందరం కలిసి ఉందామని సర్ది చెప్పటానికి ప్రయత్నించాడు. అయితే అలీ చేతిలో దారుణంగా మోసపోయిన దుర్గారెడ్డి అలీ పనిచేస్తున్న కంపెనీ వారికి అతను మోసాలను చెప్పి ఉద్యోగం లేకుండా చేసింది. దీంతో అలీ తన భార్యతో కలసి దుర్గా రెడ్డిని హింసలు పెట్టేవారు.

ఆ బాధలను భరించలేక దుర్గా రెడ్డీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అలీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దుర్గారెడ్డిని వదిలించుకొని మొదటి భార్య, పిల్లలతో ఫారూఖ్ అలుగునూర్‌లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గా రెడ్డీ అలీ ఉంటున్న ఇంటికి వద్దకు వచ్చి తనకు న్యాయం చేయమని నిరసనకు దిగింది. దుర్గారెడ్డికి మహిళ సంఘాలతో పాటు స్థానిక నాయకులు కూడా అండగా నిలిచారు.