తమిళనాడులో దారుణం… భార్య కోసం తండ్రిని దారుణ హత్య..!

తల్లిదండ్రులు తమ కొడుకు కు గాని కూతురు కి గాని పెళ్లి చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం అవతలి కుటుంబం గురించి పదిమందిని విచారించిన తర్వాతనే పెళ్లి చేస్తారు. అయితే కొన్ని సందర్బాలలో కొన్ని పెళ్లిళ్లు కలలం నిలవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడు లో చోటు చేసుకుంది.

తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని వేదారణ్యం వెంబదేవంకాడు ప్రాంతంలోనే సోండవర్ ఏరియాలో 65 ఏళ్ల పన్నీరు సెల్వం అనే రైతు నివాసం ఉంటున్నాడు. అతనికి 45 ఏళ్ల కుమారుడు కరుణానిధి ఉన్నాడు. కుమారుడు కరుణానిధికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు ఆ తండ్రి. అయితే కొన్ని రోజుల తర్వాత కరుణానిధి, అతని భార్య పునీతాల మధ్య వివాదాలు జరగడంతో ఆమె భర్త నుండి విడిపోయింది.

తన భార్యతో విడిపోవడానికి, తన తండ్రి కారణమని భావించిన కరుణానిధి తరచూ తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇదే విషయం మీద ఆదివారం నాడు కరుణానిధి తన తండ్రితో వివాదానికి దిగాడు. గొడవ జరుగుతున్న సమయంలో కోపద్రిక్తుడైన కరుణానిధి తన తండ్రిని కోపంతో చూస్తూ వెంట తెచ్చుకున్న నాటు తుపాకితో కాల్చాడు. అది కాస్త గుడి తప్పడంతో ఊపిరి పీల్చుకున్న తండ్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశాడు. కాలనీలో పరిగెత్తుతున్న సమయంలో కూడా వెనుక వైపు నుండి తండ్రి మీద కాలుపులు జరిపాడు కరుణానిధి. అయితే బుల్లెట్లు గురి తప్పి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ కు తగిలాయి.

నాటు తుపాకీతో దాడి జరగడంతో స్థానికులు హడలిపోయారు. ఏమి జరుగుతుందో అర్థం అవక ఆందోళన చెందారు. అయితే నాటు తుపాకీ దాడి నుండి తప్పించుకున్న పన్నీరు సెల్వం స్థానిక వేదరణ్యం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని, అతని వద్ద ఉన్న నాటు తుపాకీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి నాటుతూ పాకిని ఎవరు ఇచ్చారు?? ఎక్కడ లభ్యమైంది?? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.