సంగారెడ్డి జిల్లాలో దారుణం… నమ్మించి వివాహితను మోసం చేసిన ప్రియుడు!

ప్రస్తుత కాలంలో రోజురోజుకీ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్థల కారణంగా వారు ఇతరుల ఆకర్షణకు గురై అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే వివాహం చేసుకున్న వారిని మోసం చేసి ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని నమ్మి వెళ్ళిన వారు దారుణంగా మోసపోతున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఒక మహిళ కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడి వద్దకు వెళ్ళి పెళ్ళి చేసుకోమని కోరింది. అయితే ఆ ప్రియుడు ఇచ్చిన ట్విస్ట్ కి ఆ మహిళ షాక్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే…సంగారెడ్డి మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన మేతరి శైలజ అనే మహిళ అదే గ్రామానికి చెందిన ఆంజనేయ గౌడ్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. అయితే ఆమె ప్రేమా విషయం తెలిసిన శైలజ తల్లిదండ్రులు జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామానికి చెందిన గౌని నగేశ్‌ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. అయితే వివాహాం తర్వాత కూడా శైలజ తన ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అయితే శైలజను తన భర్తకు విడాకులు ఇచ్చి వస్తే తనని పెళ్లి చేసుకుంటానని ఆంజనేయ గౌడ్ ఆమెను నమ్మించాడు. ప్రియుడి మోజులో పడి శైలజ తన భర్తకు విడాకులు ఇవ్వటానికి సిద్ధమయ్యింది.అయితే శైలజ వ్యవహారం తెలిసిన ఆమె భర్త తల్లిదండ్రులు శైలజను గట్టిగా మందలించినప్పటికీ ఆమె తీరు మారకపోగా.. పెద్దలు ఏర్పాటు చేసిన పంచాయితీలో భర్తతో విడాకులు తీసుకునేందుకు శైలజ సిద్ధమైంది.

తల్లి తండ్రులు ఎంత చెప్పినా వినకుండా శైలజ తన ప్రియుడు ఆంజనేయ గౌడ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలో భర్తతో విడాకులు తీసుకునేందుకు శైలజ ఒప్పంద పత్రం కూడా రాయించుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆంజనేయ గౌడ్ ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. ఈనెల 22వ తేదీన పెళ్లి విషయమై శైలజ ఆంజనేయ గౌడ్ కి ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆంజనేయ గౌడ్ ఇంటికి వెళ్లగా అతని కుటుంబ సభ్యులు శైలజను దూషించారు. దీంతో శైలజ మోసపోయానని గ్రహించి తన ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.