సాధారణంగా పోలీసు వృత్తి అంటే ఆపదలో ఉన్న వారిని రక్షించి వారికి అండగా నిలబడటం. కానీ కొంతమంది కాకి చొక్కా ఉంది అన్న ధైర్యంతో అరాచకాలకు పాల్పడుతున్నారు. పోలీసులమన్న ధైర్యంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమాయకులను దారుణంగా హింసిస్తున్నారు. కొంతమంది పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతో సివిల్ తగాదాల్లో కూడా తలదూర్చి లంచం కోసం ఆశపడి నేరస్థులకు సహకరిస్తూ బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఘటన చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే… ఇటీవల ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భూ వివాదంలో లేడీ ఎస్సై అరుణ కల్పించుకొని ఒక యువకుడిని స్టేషన్ కి పిలిపించి ఇష్టం వచ్చినట్లు తిట్టి అతని మీద దాడి చేసింది. అంతేకాకుండా అతని బొటనవేలు విరిగిపోయేలా లాటితో కొట్టింది. అయితే తాను ఎటువంటి తప్పు చేయకుండా ఇలా స్టేషన్ కి పిలిపించి తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేరస్తులకు అనుకూలంగా మాట్లాడుతూ ఏ తప్పు చేయని తనని ఇలా శిక్షించటం సరికాదని సదరు బాధితుడు ఉన్నతాధికారులకు తన గోడు విన్నవించుకున్నాడు.
లేడీ ఎస్సై అరుణ సివిల్ వివాదంలో కలగ చేసుకోవడమే కాకుండా తనని స్టేషన్ కి పిలిచి నోటికొచ్చినట్లు తిట్టటమే కాకుండా విచక్షణ రహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లేడీ ఎస్సై అరుణ మీద సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలంటూ అధికారులను ఎస్పీ ఆదేశించాడు. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం జిల్లాలో తీవ్రదుమారం రేపుతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని లేదు ఆ యువకుడి పట్ల ప్రవర్తించిన తీరుతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సదరు లేడీ ఎస్సైని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.