హైదరాబాద్‌లో అమెజాన్ ఉద్యోగి అరెస్టు

Amazon Prime Video

హైదరాబాద్ లో గంజాయి సప్లయ్ చేస్తున్న అమెజాన్ ఉద్యోగి ప్రణవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణవ్ తను నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే ఆధునిక పద్దతిలో గంజాయిని పండిస్తున్నాడు. గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 75 ఎల్ ఎస్ డీ బాక్సులు, ఎండీఎన్ ఐ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమెజాన్ లో పనిచేస్తుండటంతో కస్టమర్లకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రణవ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు.