కళ్లి బుల్లి కబుర్లు చెప్పి డాక్టర్ ని మూడో వివాహం చేసుకున్న వ్యక్తి… ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాక్…?

ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి అంటూ పురుషుల చేతిలో మహిళలు దారుణంగా మోసపోతున్నారు . ఇలాంటి మోసాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఎంతోమంది మహిళలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ముఖ్యంగా చదువుకున్న ఎంతోమంది ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఒక వైద్యురాలు భర్త చనిపోవడంతో రెండవ పెళ్లికి సిద్ధపడి వరుడి కోసం మాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ రిజిస్టర్ చేసింది. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌కి చెందిన వంశీకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా తన మూడో పెళ్లి కోసం అదే సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. వైద్యురాలి ప్రొఫైల్ చూసి కల్లబొల్లి మాటలటో ఆమెను వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత నెల్లూరుకు వెళ్లి ఆమెను కలిసి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇద్దరికీ ఇది మొదటి పెళ్లి కాకపోవటంతో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కొంతకాలం వీరికాపురం సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత ఆ వైద్యురాలు ఓసారి నెల్లూరు వెళ్లి జనవరి 24న తిరిగి వంశీ ఇంటికి వచ్చింది అయితే అప్పటి నుంచీ అతను కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని భావించిన సదరు వైద్యురాలు అతను ఫోన్ ఎత్తకపోవడంతో తన వద్దకు రాకపోతే పోలీసుల్ని ఆశ్రయిస్తానని అతనికి మెసేజ్ చేసింది . దీంతో భయపడిన వంశీ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత తన మాయ మాటలతో ఆమెను నమ్మించి ఇంట్లో ఒక గదిలో ఆమెను బంధించాడు.

అంతటితో ఆగకుండా అదే సమయంలో మరో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతను నాలుగవ పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్‌లో మరో ప్రకటన ఇచ్చాడు. అయితే వంశీకృష్ణ వివరాలు చూసిన మ్యాట్రిమోనీ సంస్థకు డౌట్ వచ్చింది. దీంతో వాళ్లు రంగంలోకి దిగి వైద్యురాలిని రహస్యంగా విడిపించారు. ఆ తర్వాత సదరు వైద్యురాలు తనకు జరిగిన అన్యాయం గురించి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కంప్లైంట్ ఇచ్చింది. వంశీ మోసాల వెనక.. అతను కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని బాధితురాలు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వంశీ కృష్ణ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.