శ్రీవారికి స్వర్ణకిరీటం, వెండి పాదాలు కాన్క

తమిళనాడుకు చెందిన శ్రీ కన్నయ్య కుమారుడు  దొరస్వామి యాదవ్ అనే భక్తుడు సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారికి స్వర్ణకిరీటం, వెండి పాదాలను కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకలను తిరుమలలోని టిఎస్సార్ విశ్రాంతి గృహంలో టిటిడి ఛైర్మన్  పుట్టా సుధాకర్ యాదవ్ కు అందజేశారు.


ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. ఈరోజు తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన భక్తుడు శ్రీ దొరస్వామి యాదవ్ రూ. 28 లక్షలు విలువైన 1.10 కిలోలు బరువు గల బంగారు కిరీటం, రూ.2 లక్షలు విలువైన 1.60 కిలోల బరువు గల రెండు వెండి పాదాలను శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి బహూకరించారని వెల్లడించారు.